ఆదివారం 18 అక్టోబర్ 2009

నాకు తెలిసిన బాలగోపాల్


నాకు తెలిసిన బాలగోపాల్ అంటే బాలగోపాల్ గారు నాకు పరిచయమున్నారని కాదు, నేను తెలుసుకున్న బాలగోపాల్ గురించి కొంత చెప్పాలని చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాస్తున్నాను.

ఆయనని నేనెప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు కానీ మా నాన్నగారి ( గణపతి రావు నాయుడు గారు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య(APTF) ) ద్వారా ఆయనగురించి చాలా విషయాలు తెల్సుకున్నాను. మానవ హక్కుల ఉద్యమంలో ఇరువురూ పనిచేస్తున్నప్పటికీ మానవహక్కుల పట్ల ఆయన నిబద్ధత కొన్ని విషయాలలో ఆయన అతని సహచరులని కూడా విభేదించేట్లు చేసేది.

శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి నది పైన మడ్డువలస ప్రాంతంలో ఒక రిజర్వాయరు స్థాపనకి ప్రభుత్వం శంకుస్థాపన చేసి, దాదాపు రెండున్నర దశాబ్ధాలు ఆ ప్రతిపాదనని గాలికొదిలేసింది. ఆ రిజర్వాయరు నిర్మాణం పూర్తికాక ఆయకట్టు కింద ఉన్న (ఉండవల్సిన) దాదాపు నలభైవేల ఎకరాలు ఎండిపోయే పరిస్థితిలో అక్కడ రైతులు SUCI పార్టీ ( Socialist Unity Centre of India ) నాయకత్వం కింద ఒక ఉద్యమం చేపట్టారు. రైతులు, SUCI నాయకత్వం కలిసి మడ్డువలస రిజర్వాయరు సాధన పోరాట కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు. ఆ కమిటీకి కామ్రెడ్ రమేష్ పట్నాయక్ (All India Democratic Students Organization మాజి రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ ఉద్యమకారులు, మేధావి. ప్రస్తుతం ప్రొ.హరగోపాల్ వంటి వారితో కలిసి విద్యా పరిరక్షణకు, మానవ హక్కుల కొరకు ఉద్యమిస్తున్నారు ) గారు కన్వీనర్ గా , మా నాన్నగారు జాయింట్ కన్వీనర్ గా ఉండేవారు.

సాధన కమిటీ సంవత్సరాలుగా చేపట్టిన అందోళనలు విజయవంతమయ్యాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడ్డువలస వచ్చి థొంభై కోట్లు(అప్పటికి ప్రోజెక్టు అంచనా వ్యయం 120 కోట్లకి చేరింది) కేటాయించారు. నిధులు సక్రమంగా వినియోగమయ్యేట్లు చూడండంటూ సభా వేదికమీదే ఉద్యమాన్ని నడిపించిన నాయకులని పిలిచి బాధ్యతలు అప్పగించారు.

వందలాది గ్రామాల రైతుల విజయం సరే.. ముంపు గ్రామాల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు. నిజానికి అక్కడ ముంపు వలన నష్టపోయేది కేవలం మూడు గ్రామాలు మాత్రమే. వారు ఎంత గొంతు చించుకున్నా వందలాది గ్రామాల ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రొజెక్టు నిర్మాణాన్ని ఆపలేరు. ఇలాంటి సమయాలలో బాధితుల తరపున మాట్లాడే కమ్యూనిష్టు పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు రైతుల తరపున ఉద్యమంలో పాల్గోవడంతో వాళ్ళ ఆందోళనని బాహ్యప్రపంచానికి వినిపించే నాథుడే కరువయ్యాడు.

అలాంటి పరిస్థితిలో, లక్షలమంది ప్రయొజనాలు ఉన్నప్పటికి కొన్ని వేలమంది బ్రతుకుల్ని బలి చేయడం తగదని బాలగోపాల్ గారు నిర్వాసితుల తరుపున ఉద్యమానికి పూనుకున్నారు. ఆ రొజుల్లో ఉధ్రుతంగా సాగుతున్న నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమ నిర్మాత మేధా పాట్కర్ కూడా మడ్డువలస నిర్వాసితుల తరుపున ఉద్యమించారంటే అది కచ్చితంగా బాలగోపాల్ గారి ఘనతే. నిజానికి ఇక్కడి విశేషమేమంటే కామ్రెడ్ రమేష్ పట్నాయక్ గారు, మా నాన్న గారు బాలగోపాల్ గారికి ఎన్నో ఉద్యామాలలో సహచరులు. చివరికి బాలగోపాల్ గారి కృషి వలన నిర్వాసితులకి కొత్తగా గ్రామాలు నిర్మించి ఇచ్చింది ప్రభుత్వం.

బాలగోపాల్ గారు అస్థమించాక ఆయన గురించి పత్రికలలో రాస్తూ ఆయన నక్సలైట్ ఉద్యమాలు కూడా మానవహక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నాయని, అందుకే ఆయన పౌర హక్కుల ఉద్యమం నుండి బయటికొచ్చి మానవ హక్కుల వేదికని ఏర్పాటుచేసారని పేర్కొన్నాయి. నాకు తెల్సినంతవరకు ఆయన ఒక సంఘం అనుసరిస్తున్న విధానాలని విభేదించి మరొక సంఘం మాత్రమే పెట్టుకున్నారు. రెండు సంఘాలలోనూ ఆయన కృషి చేసింది మానవహక్కుల కోసమే. శ్రీ శ్రీ గారు అరసం(అభ్యుదయ రచయితల సంఘం) లో ఇమడలేక విరసం(విప్లవ రచయితల సంఘం) అంకురార్పణకి ఎలా కృషి చేసారో అదేవిధంగా బాలగోపాల్ గారు కూడా మానవహక్కుల వేదిక స్థాపనకి కారణమయ్యారు.

సోమవారం 20 ఏప్రిల్ 2009

ఆపండి మీ దుష్ప్రచారం!!!

గత నెల రోజులుగా మన తెలుగు పత్రికలు చదువుతుంటే పత్రికలమీదే అసహ్యమ్ వేస్తోంది. నిస్సుగ్గుగా, నిర్లజ్జగ్గా ఒక పార్టీకి తొత్తుల్లా వ్యవహరించడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నాయి. ఈ పత్రికలు ఏకంగా దొంగ సర్వేలు ప్రచురిస్తూ ఫలితాలనే తారుమారు చేయాలని చూస్తున్నాయి. రామోజీ రావు, రాధా క్రిష్ణ , నూకరాపు, గిరిష్ సంఘీ, వై.యస్.జగన్.. ఎవరైతే ఏంటి, పత్రికల నైతిక విలువల్ని కాలరాయడానికి.

రాష్ట్రం లో 3 పత్రికలు తెలుగు దేశం కరపత్రాలులా పని చేస్తున్నాయి. మిగతా పార్టీలను తక్కువ చేసి చూపించడంలో వీటికిమించిన పత్రికలు లేవు. జిల్లా టాబ్లాయిడ్లలో పెయిడ్ ఆర్టికళ్ళను రాస్తూ ప్రతి ఒక్కరిదీ గెలుపు బాటే అంటున్న ఈ పత్రికలకు మెయిన్ కి వచ్చేసరికి మాత్రం 'తెలుగు దేశం' తప్ప ఎవరూ గెలిచే పరిస్థితులు కనిపించట్లెదు. తన ఐదేళ్ళ పదవీ కాలంలో రామోజీ రావుని ఒక ఆట ఆడుకున్న వై.యస్ కి ఇప్పుడు రామోజి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. నిజంగా ఈనాడు భావించినంత వీక్ గా ఐతే ఆ పార్టీ లేదు. మిగిలిన రెండు పార్టిలతో సరిసమానంగా సీట్లు సాధింఛే సత్తా కాంగ్రెసుకి వుంది.

ఇదే ఈనాడు పత్రిక తెలుగు దేశాన్ని కాకుందా మరో పార్టీ బాధ్యతలను కూడా మోస్తోంది. అదే లోక్ సత్తా పార్టీ.
సచ్చీల రాజకీయాలంటూ బయలుదేరిన ఈ పార్టీ 'లో గుట్టు', రామోజీ రావుతో జే.పీ గారి అనుభందాన్ని చూస్తే బయటపడుతుంది. యన్టీయార్ ని పదవీచ్యుతుడిని చేయడం దగ్గరనుండి .. ఇప్పుడు టీవీలలో కుప్పలు తెప్పలుగా ప్రసారం అవుతున్న యాడ్ ల వరకు వెనకున్న నిజాల్ని తరచి చూస్తే వీరి బంధం ఎంత గట్టిదో ఎవరికైనా తెలుస్తుంది. కొత్తగా పుట్టిన ప్రజారాజ్యం వోట్ల చీలికే లక్ష్యంగా ( తెలుగుదేశం విజయం) వీరు సాగిస్తున్న నాటకం కళ్ళముందు కనబడుతుంది. సొంత కులానికి అన్ని సీట్లను ఇచ్చుకున్న జయప్రకాశ్ గారు social justice ఎలా సాధిస్తారో ఆ దేవుడుకే ఎరుక.

ఇలా పేరున్న పత్రికలన్నీ తమ సామాజికవర్గానికి, కులానికి సంభదించిన పార్టీలకే సపోర్ట్ చేస్తూ పత్రిక అన్న పేరుకే చెడ్డపేరు తీసుకువస్తున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తెలుగుదేశానికి పట్టులేని ప్రాంతాలలో కూడా ఆ పార్టీ పుంజుకుంటున్నట్లుగా వార్తలు రాసి అక్కడ neutral voters ని ప్రభావితం చేస్తున్నాయి. వీళ్ళ దొంగ సర్వేలు చదువుతా వుంటే ఆయా పార్టీలకే ఎంతో అసహజం అనిపించేట్లుగా వుంటున్నాయి. ఈనాడు సర్వేలో మా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం ఎంతో బలంగా వున్నట్లు చూపిస్తున్నారు. ఎన్నికలు అయ్యాక తప్పదు అన్నట్లు ప్రజారాజ్యానికి అనుకోని విధంగా ఎక్కువ వోట్లు పోలయ్యాయని మళ్లీ కాకి లెక్కలు వేయడం ప్రారంభించారు. ఇలానే తూర్పు, పశ్చిమాలలో అస్సలు పట్టులేని తెలుగుదేశం పుంజుకుంటోంది అన్నట్లుగా రోజు వార్తలు ప్రచురిస్తూ మిగతా పార్టీలని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తోంది.

ప్రజారాజ్యం ఫై దుష్ప్రచారం : ఇటీవల తెలుగుదేశాన్ని వీడిన నాయకుల పేర్లు చెప్పగలరా!? పోనీ కాంగ్రెస్ ని వీడిన నాయకుల పేర్లు చెప్పగలరా? చెప్పలేరు.. కాని ప్రజరజ్యాన్ని వీడిన నాయకులు అని అడిగితే మాత్రం పెద్ద చిట్టా విప్పగలరు.. ఏం? మిగతా పార్టీలనుండి నాయకులు వెళ్ళిపోవడం లేదా? కాని జనానికి ఆ విషయం ఎందుకు చేరడం లేదు? పరకాల ప్రభాకర్ లాంటి ఒక చిన్న నాయకుడు పార్టీ నుండి వెళ్ళిపోతే అంత ప్రచారం అవసరమా? ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికలలో నెగ్గని, తన భార్యని కూడా పార్టీలోకి తీసుకురాలేని ఒక చేత కాని నాయకుడు వెళ్ళిపోతే ఎందుకు అంత ప్రచారం? కాంగ్రెస్ నుండి ఆదికేసవుల నాయుడు లాంటి పెద్ద లీడర్ ప్రజరజ్యమ్లోకి వస్తే జనానికి ఎందుకు తెలియట్లేదు? పార్టీ లో టికెట్స్ ఆశించి భంగపడిన ఇలాంటి నాయకులు పోతే ఎందుకిస్తున్నారు అంత ప్రచారం?? కొత్త పార్టీ మీద ఇంత దుష్ప్రచారమా? ఒక వ్యక్తిని అడ్డుకోవడానికి ఇన్ని కుట్రలా?

ఒకటే కులం ఆధిపత్యం లో మగ్గిన సినిమా ఇండస్ట్రీలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నెగ్గిన ఘనత చిరంజీవిది.. ఇప్పుడు అలానే అణగదొక్కాలని చూస్తున్నారు.. కానీ జనం అంతా చూస్తున్నారు. ప్రజరాజ్యానికి ౩౦ సీట్లకు మించి రావని తెగ ఉదరగోట్టాయి సర్వేలన్నీ.. ఇప్పుడు ఉత్తరాంద్రలోనే ౨౦(20) కి మించి సీట్లు వచ్చే పరిస్థితి ఉంది ప్రజారాజ్యానికి... కానీ ఈ పత్రికలు విషం కక్కడంవలన ప్రజారాజ్యం 5% వోట్లైనా కోల్పోయే పరిస్థితి వచ్చింది. అయినా సరే 70 సీట్లకు తగ్గకుండా గెలుచుకునే సత్తా వుంది ఈ పార్టీకి. అపుడు ముఖ్యమంత్రి పీఠం ఎవరెక్కుతారు? చంద్రబాబా? లేక వై.యస్ ఆ?

తెలుగుదేశం ఎలాగూ ప్రజారాజ్యం వోట్లను చీల్చలేదు కాబట్టి రామోజీ రావు కి దొరికిన ప్రత్యామ్నాయం.. లోక్ సత్తా. నిజంగా జయప్రకాశ్ అంత నిజాయితీపరుడా? అంత సచ్చీలుడా? అలా అయితే కూకట్ పల్లి లో కాదు వెళ్లి నల్గొండలో పోటి చేయాల్సింది.. పోలేపల్లిలో తన ప్రతాపం చూపాల్సింది. ఆంధ్ర నుండి వలస వచ్చిన వారితో నిండిపోయిన కూకట్ పల్లిలో ఎందుకు పోటి చేస్తున్నాడు? లోక్ సత్తాలో జయప్రకాశ్ కాకుండా ఇంకొక నాయకుడి పేరు చెప్పండి.. రాష్ట్రాన్ని గెలిపించండి, కేవలం నాలుగు కుటుంబాలని కాదు అని ప్రకటనలు దంచిన వాడికి సొంత పార్టీలో ప్రజా స్వామ్యం కొరవడి వ్యక్తి స్వామ్యం రాజ్యమేలుతోంది అన్న సంగతి గుర్తు రాలేదా? ఆంధ్రా నుండి వలస వచ్చిన వారు అధికంగా వుంటే మహా కూటమి అక్కడ తెరాసా కి ఎందుకు సీట్ ఇచ్చింది?? జనం అంత వెర్రి వాళ్ళు కారు జయప్రకాశ్.. అన్నీ చూస్తున్నారు.. ఎన్నికలకు ముందురోజు కూకటపల్లి లో నువ్వు పంచిన బిర్యానిలే సాక్ష్యం.. పోలీసులకు దొరికిపోయినా మీడియా పట్టించుకోలేదు అంటే.. నీకు హ్యాట్సాఫ్!!

బుధవారం 25 మార్చి 2009

ఎవరిని ఎన్నుకోను??

ఐదేళ్ళు గిర్రున తిరిగిపోయాయి. మళ్ళీ ఎన్నికలొచ్చేసాయి. కానీ క్రితం ఎన్నికలకి నాకింకా పదిహేడెళ్ళు కూడా నిండకపోవడంచేత ఎన్నికలగురించి ఆలోచించినా వోటు ఎవరికి వేయాలి అని మాత్రం ఆలోచించలేదు. కాని తొలిసారి నేను ఈ ఎన్నికలకి వేయబోయే వోటు గురించి మాత్రం కొంతవరకు ఆలోచిస్తున్నానే చెప్పాలి. కొంతవరకు అని ఎందుకు అంటున్నానంటే , ఎంతోకొంత మనసులో చిరంజీవికి వోటు వేయాలి అనుకున్నానుగనక!

అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ కన్నా, అధికారం కైవసం చేసుకోవడానికే ఏర్పడిన భావ సారుప్యతలేని పార్టీల కలయిక అయిన మహాకూటమికన్నా చిరంజీవికి వోటు వేయడమే మంచిదనిపించింది. లోక్ సత్తా కి వోటేయొచ్చుగా అని అడిగేవాళ్ళు కుడా ఉన్నారు... కానీ చిరంజీవి మార్పు మంత్రం లాగానే ఈయనగారి మంత్రం కూడా జనానికి అర్ధం కాకుండా ఉంది. ఓ సారి జయప్రకాష్ ని ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా యుద్ధాన్ని గురించి వ్యాఖ్యానించమనగా " ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం మీదం యుద్ధం చేయకుండా ఎవరైనా ఏం చేస్తారు? " అని ప్రశ్నించాడంట!! ఈయనగారి తెలివితేటలు అలా ఏడిచాయి. అంతవరకూ ఆయనమీద ఉన్న మేధావి అనే ముద్ర( నా మనసులో సుమా..) ఆ దెబ్బతో చెరిగిపోయింది.

ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే.. ఏ రాయి ఐతే ఏంటి పళ్ళు విరగ్గొట్టుకోడానికి అన్న మాదిరిగా తయారయ్యాయి. ఎంతమాత్రమూ అధికారంలోకి రాకూడని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇదొక అతివాద హిందూ పార్టీ తప్పితే మరొకటి కాదు. భారతీయులని భారతీయులుగా కాక మత ప్రాతిపదికన విడగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసే పార్టీ. ఒకవేల ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ని మారణహోమాలు జరుగుతాయో తలుచుకుంటేనే భయమేస్తుంది. అప్పుడు మరింతమంది మోడీలు పుట్టుకోస్తారు.. అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోతారు. మోడీ కన్నా నీచుడు (అద్వాని) మన ప్రధాని ఐతే ఇక పరిస్థితి ఊహించుకోండి. అద్వాని ఒక అభినవ హిట్లర్. ఇందులో ఎటువంటీ సందేహమూ లేదు.

కాంగ్రెస్ పార్టీవి ఓటు బ్యాంకు రాజకీయాలు ఐనా కూడా ఈ విషయంలో భా.జా.పా కన్నా చాలా నయం. కాకపొతే.. మన దేశ సార్వభౌమత్వాన్ని తీసుకెళ్ళి అమెరికా లాంటి దేశాల చేతిలో పెడుతుంది. అణు ఒప్పంద విషయంలో జరిగింది ఇదే. ఈ రెండు పార్టీలకన్నా కమ్యూనిష్టులమని చెప్పుకునేవాళ్ళు (CPI, CPM) కొంతవరకూ నయం. కాకపోతే అవి కమ్యూనిష్టు పార్టీలనే గుర్తింపునుండి బూర్జువా పార్టీలు అనే గుర్తింపుని రోజు రోజుకి పొందుతున్నాయి. అధికారంలో ఉన్న చోట్ల ఒకలా, ప్రతిపక్షంలో ఉన్న చోత ఒకలా వీరు పాటిస్తున్న ధ్వంధ్వ ప్రమాణాలు ప్రజలు ఈ పార్టీల మీద విస్వాసం కొల్పొయేలా చేస్తున్నయి.

యువతే రాజకీయలలోకొచ్చి ప్రత్యక్ష పోటీకి దిగుతున్న తొలి ఎన్నికలు బహుసా ఇవే కావచ్చు. విద్యాలయాలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన యువత YOUTH FOR EQUALITY పేరుతో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయనుంది. వీరిని ఎంతవరకూ మన దేశ ఓటర్లు అర్ధం చేసుకుంటారో చూడాలి. (ఇంకా ఉంది)

ఇటీవలి వ్యాఖ్యలు